DEO: పాఠాలు అర్థం అవుతున్నాయా?
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:21 AM
చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ తరగతులను మంగళవారం డీఈవో లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు.
చిత్తూరు సెంట్రల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సాధారణ తరగతులు, స్పెషల్ క్లాసులు ఎలా జరుగుతున్నాయి? టీచర్లు చెబుతున్న పాఠాలు అర్థం అవుతున్నాయా? అంటూ పదో తరగతి విద్యార్థులను డీఈవో లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకున్నారు. చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ తరగతులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రోజువారీ నిర్వహించే స్లిప్ టెస్టుల ప్రయోజనాలను తెలుసుకున్నారు. అనంతరం ఇంగ్లీషు సబ్జెక్టులోని పలు అంశాలను విద్యార్థులకు బోధించారు. పబ్లిక్ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు సూచించారు. స్పెషల్ తరగతుల నిర్వహణపై టీచర్లకు పలు సూచనలు చేశారు.