Share News

Shining Stars: విద్యతోపాటు వ్యక్తిత్వమూ ముఖ్యం

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:48 AM

విద్యతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని విద్యార్థులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. విద్యాశాఖ- సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

Shining Stars: విద్యతోపాటు వ్యక్తిత్వమూ ముఖ్యం
కలెక్టర్‌, ఎమ్మెల్యేల నుంచి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు, చెక్‌ను తల్లిదండ్రులతో కలిసి అందుకుంటున్న విద్యార్థి

చిత్తూరు సెంట్రల్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): విద్యతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని విద్యార్థులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. విద్యాశాఖ- సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. బాగా చదివి ఎంపిక చేసుకున్న రంగాల్లో రాణించి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైనవిద్య, ఆధునికసౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి సత్కరించడం ద్వారా పోటీతత్వం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావకాశాలను, హాస్టల్‌ వసతులు, నాణ్యమైన బోధనను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను సాధించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ సూచించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యకు అనేక సంస్కరణలను విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తీసుకొస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ పేర్కొన్నారు. అనంతరం 2026లో టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్లో మండలానికి ఆరుగురు చొప్పున 168 మందికి, ఇంటర్‌లో జిల్లావ్యాప్తంగా 34 మందికి కలెక్టర్‌, ఎమ్మెల్యేల చేతుల మీదుగా షైనింగ్‌ స్టార్‌ అవార్డులు, పతకాలు, ప్రైజ్‌ మనీ రూ.20వేల చెక్కు అందించారు. ఈ కార్యక్రమంలో చుడా చైౖర్‌పర్సన్‌ కటారి హేమలత, డీఈవో లక్ష్మీనారాయణ, డీఐఈవో రఘుపతి, ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్‌, ఏపీసీ వెంకటరమణ, ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్‌, చిత్తూరు డీవైఈవో ఇందిర, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:48 AM