ఆన్‌లైన్‌లో ఔషద విక్రయాలపై AIOCD ఆగ్రహం
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:48 PM
ఆన్‌లైన్ మెడికల్ షాపుల వల్ల దేశంలో ఉన్న లక్షలాది మంది మందుల వర్తకుల వ్యాపారాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని, ఆన్లైన్ లో ఇచ్చే భారీ డిస్కౌంట్ల వెనుక ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. కేవలం కౌంటర్ సేల్స్ ద్వారానే అధికారులు ఎప్పటికప్పుడు మందుల నాణ్యతను తనిఖీ చేయడానికి వీలవుతుందన్నారు.
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (AIOCD) ఆరవ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం తిరుపతిలో నిర్వహించారు "ఎడ్యుకేషనల్ సెమినార్ అండ్ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్" అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించిన సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ ప్రత్యేక వేదికపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో అత్యున్నత బాధ్యతలు చేపట్టిన ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు దారపు ఎన్.ఆర్.పి. రెడ్డి,ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఏపీ నుంచి నామినేట్ అయిన డి.నరేంద్రతో పాటు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఈసీ సభ్యులు సుబ్బరామ గుప్తా , కళ్యాణ్ చక్రవర్తిను సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు.
ఈ సందర్భంగా AIOCD జాతీయ అధ్యక్షుడు జె. షిండే మాట్లాడుతూ, ఆన్‌లైన్ మెడికల్ షాపుల వల్ల దేశంలో ఉన్న లక్షలాది మంది మందుల వర్తకుల వ్యాపారాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని, ఆన్లైన్ లో ఇచ్చే భారీ డిస్కౌంట్ల వెనుక ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. కేవలం కౌంటర్ సేల్స్ ద్వారానే అధికారులు ఎప్పటికప్పుడు మందుల నాణ్యతను తనిఖీ చేయడానికి వీలవుతుందని, తద్వారానే ప్రజలకు సురక్షితమైన మందులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. ఫార్మసీ రంగాన్ని రక్షించుకోవడానికి, వ్యాపారుల హక్కుల కోసం అందరూ సమిష్టిగా ముందుకు సాగాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం, ప్రధాన కార్యదర్శి కరుణ్ కుమార్ గుప్తా, కోశాధికారి సాధు ప్రసాద్ తో పాటు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, కృష్ణమూర్తిలు తిరుపతిలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (AIOCD) ఆరవ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
Also Read:
సాయికృష్ణ కేసులో విజయలక్ష్మిని ప్రశ్నించిన సిట్ అధికారులు
BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి