Share News

బర్త్‌డే విషెష్ చెప్పిన పవన్.. ఎమోషనల్ రిప్లై ఇచ్చిన మెగాస్టార్ చిరు..

ABN , Publish Date - Aug 22 , 2026 | 03:12 PM

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన సోదరుడికి భావోద్వేగపూరిత రిప్లై ఇచ్చారు.

బర్త్‌డే విషెష్ చెప్పిన పవన్.. ఎమోషనల్ రిప్లై ఇచ్చిన మెగాస్టార్ చిరు..
Chiranjeevi Emotional Post

ఇంటర్‌నెట్ డెస్క్: తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన సోదరుడికి భావోద్వేగపూరిత రిప్లై ఇచ్చారు. పవన్ కల్యాణ్ ప్రేమ తన జీవితంలో దక్కిన గొప్ప ఆశీర్వాదాలలో ఒకటని చిరు పేర్కొన్నారు. పవన్ పట్టుదల, నిజాయితీ, స్వార్థం లేని ప్రయాణం తనకు ఎన్నో విధాలుగా స్ఫూర్తిగా నిలిచాయని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరు తన పోస్టులో ఇంకా ఏమన్నారంటే..


‘ప్రియమైన కల్యాణ్ బాబు.. నీ మాటలు మన జీవితంలోని అత్యంత విలువైన అధ్యాయాలను గుర్తుచేసి నన్ను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. నా ప్రేమ, త్యాగంగా నువ్వు గుర్తుచేసుకున్నది.. నీ అన్నయ్యగా నా బాధ్యత, అనురాగం మాత్రమే. ఈరోజు నీ అచంచలమైన ధైర్యం, ప్రజల పట్ల నిబద్ధత, మన భారతావనిపై ప్రేమను చూసి నేను ఎంతో గర్విస్తున్నాను’..


‘నువ్వు కోట్లాది మందికి శక్తిగా, స్ఫూర్తిగా నిలిచావు. నన్ను నీ హీరో అని అంటూ ఉంటావు. పట్టుదల, నిజాయితీ, స్వార్థం లేని నీ ప్రయాణం ఎన్నో విధాలుగా నాకు స్ఫూర్తిగా నిలిచాయి. ఈ అందమైన జ్ఞాపకాల కానుకకు ధన్యవాదాలు కల్యాణ్ బాబు. నీ ప్రేమ నా జీవితంలో దక్కిన గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి. ఎల్లప్పుడూ నిను ప్రేమించే నీ అన్నయ్య’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

మానవత్వం అంటే ఇదే కదా.. ఆవును రక్షించటం కోసం తన ప్రాణాలను..

ఆర్డర్ చేసిన పిజ్జాలో 3 అంగుళాల కోత.. రూ.10,520 జరిమానా

Updated Date - Aug 22 , 2026 | 03:42 PM