Share News

చిన్నారులతో ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:37 AM

నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాల్లో చిన్న పిల్లలను సైతం దింపారు. కరపత్రాల పంపిణీ, ప్రచార కార్యక్రమంలో డ్రమ్స్‌ మోగించడం వంటి పనుల్లో చిన్నారులు పాల్గొన్నారు.

చిన్నారులతో ఎన్నికల ప్రచారం

గుంటూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాల్లో చిన్న పిల్లలను సైతం దింపారు. కరపత్రాల పంపిణీ, ప్రచార కార్యక్రమంలో డ్రమ్స్‌ మోగించడం వంటి పనుల్లో చిన్నారులు పాల్గొన్నారు. పిల్లలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించరాదన్న కనీస స్పృహ కూడా లేకుండా కొంతమంది అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలోని 27వ డివిజన్‌ పరిధిలో వైసీపీ అభ్యర్థి తన ప్రచార కార్యక్రమంలో పిల్లల్ని వినియోగించారు. చిన్నారులతో డ్రమ్స్‌ మోగిస్తూ ప్రచారం కార్యక్రమాన్ని హోరెత్తించారు. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో తమ కుటుంబ సభ్యుల స్థానంలో డ్రమ్స్‌ మోగించడానికి విద్యార్థులు వచ్చినట్లు ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:37 AM