Share News

చిలకలూరిపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:27 AM

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ కరీమున్‌ వైసీపీకి రాజీనామా చేసి ఆదివారం రాత్రి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు.

చిలకలూరిపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ

  • టీడీపీలో చేరిన చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ కరీమున్‌

చిలకలూరిపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ కరీమున్‌ వైసీపీకి రాజీనామా చేసి ఆదివారం రాత్రి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. కరీమున్‌ దంపతులకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిలకలూరిపేట జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్థి తోట రాజ రాజేశ్వరికి కరీమూన్‌ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో రాజరాజేశ్వరి, ఆమె భర్త తోట రాజారమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 04:27 AM