Share News

రాష్ట్రాభివృద్ధికి కొత్త పాలసీలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:15 AM

రాష్ట్రాభివృద్ధి కోసం అనేక కొత్త పాలసీలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులోనూ పలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని అన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..

రాష్ట్రాభివృద్ధికి కొత్త పాలసీలు

  • పరిశ్రమలు గ్రౌండింగ్‌ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే

  • కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి కోసం అనేక కొత్త పాలసీలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులోనూ పలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని అన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భవిష్యత్తు నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకునేలా ఈ రెండు రోజులు చర్చించామన్నారు. సమర్థులైన వారిని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు నైపుణ్యాలు అందింపుచ్చుకునేలా ఉండాలని సూచించారు. ఏది చేసినా ప్రజలకు మేలు చేయడమే అంతిమ లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఒప్పందాలు చేసే బాధ్యత తమదని, వాటిని గ్రౌండింగ్‌ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని చెప్పారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి ఆగిపోకూడదని, ప్రగతి నిలిచిపోకూడదని, ‘ఇన్వె్‌స్టమెంట్‌ డిలేడ్‌ అంటే ఎంప్లాయ్‌మెంట్‌ డినైడ్‌’ అనే అంశాన్ని గుర్తించాలని అన్నారు.

‘‘27 నెలలుగా అనేక సవాళ్లు దాటుకుని అన్ని వ్యవస్థల్లో నిర్మాణాత్మకంగా మార్పులు తెచ్చాం. వృద్ధిరేటు పెరిగింది. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతలపై స్పష్టంగా ఉంది. ప్రధాని మోదీ ప్రోత్సాహం, పవన్‌ సహకారంతోనే ఇది సాధ్యమైంది. అభివృద్ధిలో కలెక్టర్లు బాగా సహకరించారు. రాయలసీమలో ఎప్పుడూ లేని అభివృద్ధి చేపట్టారు. భోగాపురం, వెలిగొండ పూర్తి చేసి భరోసా కల్పించాం. అమరావతి సచివాలయానికి గతంలో కరకట్ట మీదుగా రావాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు రాజమార్గంలో వచ్చారు. అమరావతిని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మార్చే బాధ్యత మనందరిదీ. ఏపీ లాజిస్టిక్స్‌ హబ్‌గా మారబోతోంది. ఎల్‌నినో సమస్యలున్నా ఇలాంటి అభివృద్ధి రావడం గొప్ప విషయం. 2030 కామన్‌వెల్త్‌, 2035 ఒలింపిక్స్‌లో మన యువత పాల్గొనేలా మార్గం సుగమం చేయాలి.


మెగా డీఎస్సీని 350 పిటిషన్లు వేసి అడ్డుకోవాలని చూశారు. ఇంకా వాటిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 2027 మార్చి నాటికి భూసమస్యలన్నీ పరిష్కారం కావాలి. 5.32 లక్షల ఇళ్లను 2027కు పూర్తి చేయాలి. గ్రామాల్లో 5 సెంట్లు పేదలకు ఇంటి స్థలాలివ్వాలి. అందరికీ ఇళ్లు నిర్మించాలి. టిడ్కో ఇళ్లను 2027 నాటికి పూర్తి చేయాలి’’ అని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 04:15 AM