Share News

1980లలో నేను...

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:36 AM

దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు, ప్రజలు తమ 1980ల నాటి ఏఐ సృష్టించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

1980లలో నేను...

అమరావతి, రామకుప్పం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు, ప్రజలు తమ 1980ల నాటి ఏఐ సృష్టించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు మాత్రం 1980లలో తన అసలైన ఫొటోలను శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అప్పటి తన పాస్‌పోర్టు సైజు ఫొటో, సినిమారంగానికి సంబంధించి కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరావుతో కలసి ఉన్న ఫొటో, చంద్రగిరి నియోజకవర్గంలో బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు. ‘1980 ట్రెండ్‌లో అసలైన వాటితో జతకలుపుతున్నాను. ఆ దశాబ్దానికి చెందిన నా కొన్ని నిజమైన ఫొటోలు’ అంటూ ఆ పోస్టుకు వ్యాఖ్యానం జోడించారు. మంత్రి లోకేశ్‌ ఏఐతో రూపొందించిన 1980 ట్రెం డ్‌ ఫొటోను ఫేస్‌బుక్‌ వేదికగా షేర్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 04:36 AM