Share News

ప్రపంచ మార్కెట్లకు ఆంధ్ర అనుసంధానం

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:24 AM

ప్రపంచ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానించే లక్ష్యంతో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.CII Partnership Summit 2026, Chandrababu Naidu, Andhra Pradesh Global Markets, Visakhapatnam International Summit

ప్రపంచ మార్కెట్లకు ఆంధ్ర అనుసంధానం

  • వాణిజ్యం నుంచి క్వాంటమ్‌ వరకూ..

  • ఆరు ప్రధాన రంగాలపై విస్తృత చర్చ

  • 59 దేశాలు, 15 మంది విదేశీ మంత్రుల భాగస్వామ్యం

  • సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సమీక్షలో సీఎం

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానించే లక్ష్యంతో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖలో ఈనెల 12, 13 తేదీల్లో సదస్సు జరగనున్న నేపథ్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత డిక్లరేషన్‌పైనా సీఎం సమక్షంలో విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

‘‘రెండు రోజులపాటు ‘నావిగేటింగ్‌ న్యూ వరల్డ్‌ ఆర్డర్‌: ట్రేడ్‌, టెక్నాలజీ, ట్రస్ట్‌’ థీమ్‌తో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. సుమారు 59 దేశాలకు చెందిన ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు హాజరయ్యే వీలుంది. 40 మందికిపైగా అంతర్జాతీయ వక్తలు, 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది దేశీయ ప్రతినిధులు హాజరవుతారు. ఈ సదస్సులో వాణిజ్యం నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ వరకూ ఆరు ప్రధాన రంగాలపై విస్తృత చర్చ జరుగుతుంది.


1)వాణిజ్యం, పెట్టుబడులు, గ్లోబల్‌ వాల్యూ చైన్స్‌, 2) ట్రస్ట్‌, జియో ఎకనామిక్స్‌, ప్రపంచ సహకారం, 3) సాంకేతికత, ఆవిష్కరణలు, భవిష్యత్‌ పరిశ్రమలు, 4) ప్రతిభ, నైపుణ్యాలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, 5) స్వచ్ఛమైన ఇంధనం, సుస్థిర వృద్ధి, 6) వ్యవసాయ రంగ రూపాంతరం, ఆహార భద్రత, బయో ఎకానమీ... అంశాలపై మేధోమథనం జరుగుతుంది’ అని అధికారులు, సీఎంకు వివరించారు. దీంతో ‘ఈ ఆరు రంగాలకు చెందిన విధాన రూపకర్తలు, గ్లోబల్‌ సీఈఓలు, పెట్టుబడిదారులు, అంకుర సంస్థలను అనుసంధానించే దిశగా సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు-2026 నిర్వహించాలి.

సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ అవకాశాలను పరిచయం చేసే దిశగా సదస్సు ఫలప్రదంగా జరగాలి. ఎస్ర్కో ఖాతా ద్వారా పారిశ్రామిక వేత్తలకు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంలో భాగంగా అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించాలి.

అత్యుత్తమ సాంకేతిక సదుపాయాలు, నాలెడ్జి, బలమైన నాయకత్వం వంటి సానుకూలతలు కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉందన్న విశ్వాసాన్ని పారిశ్రామికవేత్తల్లో నింపాలి. అత్యత్తమ పాలసీలు, సమర్థులైన నిపుణులతో కూడిన రాష్ట్రం గురించి పారిశ్రామికవేత్తలకు సమగ్రంగా వివరించాలి’ అంటూ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 04:27 AM