చంద్రబాబు అరెస్ట్ రోజును మర్చిపోలేం: పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:30 PM
సెప్టెంబర్ 9ను తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని చీకటి రోజుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభివర్ణించారు. ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్ట్ చేసి వేధించడం నాటి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. కష్టకాలంలో చంద్రబాబుకు తెలుగు ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు.
అమరావతి: సెప్టెంబర్ 9 తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని చీకటి రోజని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజాసేవకు అంకితమైన సీఎం చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్ట్ చేసి వేధించడం నాటి ప్రభుత్వం అనుసరించిన నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్ని కుట్రలు, అవరోధాలు ఎదురైనా చంద్రబాబు నాయుడు పాటించిన నీతి, నిజాయితీ, ప్రజాసేవను ఎవరూ అణచివేయలేకపోయారని పేర్కొన్నారు. ఆ కష్టకాలంలో చంద్రబాబుకు అండగా రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా గళమెత్తారని.. ఇది ఆయనపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
న్యాయస్థానాల్లో చివరకు నిజం గెలిచి.. అక్రమ కేసులు నిలవకపోవడం ద్వారా ధర్మం, న్యాయం ఎప్పటికైనా విజయం సాధిస్తాయనే విషయం మరోసారి రుజువైందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని అన్నారు. ఆయన చేసిన సేవలు, రాష్ట్ర అభివృద్ధికి అందించిన కృషి తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రత్యర్థి.. ఆ బాధ తనకు తెలుసంటూ..!
పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్