ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:10 AM
ఏబీఎన్ చానల్ 17వ వార్షికోత్సవం, ఆంధ్రజ్యోతి పత్రిక 24వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకి, పాత్రికేయులకు, సిబ్బందికి సీఎం చంద్రబాబు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ చానల్ 17వ వార్షికోత్సవం, ఆంధ్రజ్యోతి పత్రిక 24వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకి, పాత్రికేయులకు, సిబ్బందికి సీఎం చంద్రబాబు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయ విలువలకు కట్టుబడి, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం రాజీలేని నిబద్ధతతో కృషి చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ప్రస్థానం మరింత వెలుగొందాలని ఆకాంక్షించారు. పాఠకులకు, వీక్షకులకు, ప్రజలకు మరింత చేరువ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
అక్షరమే ఆయుధంగా పనిచేస్తోంది: లోకేశ్
అక్షరమే ఆయుధంగా, జనవాణిని తన బాణీగా చేసుకున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్కు మంత్రి లోకేశ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజాప్రయోజనాలు, విలువలతో కూడిన కథనాలు, ప్రసారాలతో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలు తెలుగు పాఠకులు, వీక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సంస్థలు అనునిత్యం వార్షికోత్సవ స్ఫూర్తిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని మంత్రి లోకేశ్ అన్నారు.
మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: మంత్రి సత్యకుమార్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు మంత్రి సత్యకుమార్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు, సంస్థలోని పాత్రికేయులు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు