Share News

నేడు, రేపు కేంద్ర బృందాల పర్యటన

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:39 AM

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జరిగిన నష్టాలను పరిశీలించేందుకు శని, ఆదివారాలు, కరువు పరిస్థితులను అంచనా వేయడానికి సోమ, మంగళవారాల్లో ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌లు (కేంద్ర బృందాలు) రాష్ట్రంలో పర్యటించనున్నాయి.

నేడు, రేపు కేంద్ర బృందాల పర్యటన

  • అర్నబ్‌ తుఫాన్‌ నష్టం, కరువు పరిస్థితుల పరిశీలన

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జరిగిన నష్టాలను పరిశీలించేందుకు శని, ఆదివారాలు, కరువు పరిస్థితులను అంచనా వేయడానికి సోమ, మంగళవారాల్లో ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌లు (కేంద్ర బృందాలు) రాష్ట్రంలో పర్యటించనున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని కేంద్ర బృందం శని, ఆదివారాల్లో పరిశీలించనుంది. ఇందుకోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్‌ సెక్రటరీ చిత్తరంజన్‌దాస్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, తుఫాన్‌ ప్రభావాన్ని స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయనున్నాయి. నవంబరు 2వ తేదీన ఈ కేంద్ర బృందం సీఎంతో భేటీ అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ శుక్రవారం తెలిపారు. కాగా, కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు 4 రోజులు రాయలసీమలో పర్యటించనున్నాయి. 4న ఈ బృందాలు సీఎంతో భేటీ అవుతాయని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 02:42 AM