Share News

తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి నివేదిస్తాం

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:38 AM

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, నష్టం అంచనాలు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ఆదివారం కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించింది

తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి నివేదిస్తాం
central team

central3.jpg

  • కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనల్లో కేంద్ర బృందం వెల్లడి

  • దెబ్బతిన్న పంటలు, రోడ్లు, బోట్లు పరిశీలన

  • మత్స్యకారులు, రైతులతో ముఖాముఖి.. తుఫాన్‌ నష్టంపై ఆరా

కాకినాడ కలెక్టరేట్‌/నరసాపురం రూరల్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, నష్టం అంచనాలు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ఆదివారం కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌దాస్‌ నేతృత్వంలో ఓ బృందం కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతం, కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌, తాళ్లరేవు, పిఠాపురం, కాజులూరు మండలాలకు దెబ్బతిన్న అరటి తోటలు, ఉప్పాడ రోడ్డు, తాళ్లరేవు, కాజులూరు మండలాల్లోని పోలేకుర్రు, కోలంక నీటిమునిగిన వరిచేలు, కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో దెబ్బతిన్న బోట్లు, వలలను బృందం పరిశీలించింది. తుఫాన్‌తో నష్టపోయిన తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని రైతుల కోరగా, నష్టాలపై కేంద్రానికి నివేదిస్తామని బృందం ప్రతినిధులు వెల్లడించారు. అంతకుముందు కాకినాడ కలెక్టరేట్‌లో ఫొటో ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది. ప్రశాంత్‌ ఆర్మోరికర్‌, హిమాలయగర్గ్‌, ప్రణయ్‌గర్గ్‌లతో కూడిన బృందం వెంట రాష్ట్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్‌ ప్రఖర్‌జైన్‌, జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ తదితరులు ఉన్నారు.


‘పశ్చిమ’లో పర్యటన ఇలా..

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో మరో బృందం పర్యటించింది. దెబ్బతిన్న పంటలు, ఆక్వా చెరువులు, బోట్లు, నేలకొరిగిన విద్యుత్‌ స్థంభాలు, చెట్లను పరిశీలించారు. సభ్యులు కొల్లు రేఖరాణి, ఇస్రో శాస్త్రవేత్త ఎస్‌విఎస్ పి శర్మ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కార్యదర్శి అలోక్‌ జవహర్‌ తదితరులు రైతుల కష్టాలను తెలుసుకున్నారు. వారికి నరసాపురం పట్టణం, మండలంలోని లిఖితపూడి, చినలంక, బియ్యపుతిప్ప, పీఎంలంక గ్రామాల్లో జరిగిన నష్టాన్ని కలెక్టర్‌ నాగరాణి వివరించారు. అనంతరం రైతులు, మత్స్యకారులు, మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం

Updated Date - Nov 02 , 2026 | 01:49 AM