Share News

మాతృభాష పరిరక్షణ కోసం

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:12 AM

మాతృభాష పరిరక్షణ కోసం ప్రజలు నడుం బిగించాలని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పూల త్రివిక్రమ్‌ పిలుపునిచ్చారు.

మాతృభాష పరిరక్షణ కోసం

  • ప్రజలు నడుం బిగించాలి

  • అధికార భాషా సంఘం అధ్యక్షుడు పూల త్రివిక్రమ్‌

తాడేపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మాతృభాష పరిరక్షణ కోసం ప్రజలు నడుం బిగించాలని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పూల త్రివిక్రమ్‌ పిలుపునిచ్చారు. తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకటరామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవం-2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి తెలుగు, సంస్కృత అకాడమి అధ్యక్షుడు ఆర్‌డీ విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ సామాన్యుల భాష.. అధికార భాషగా ఉండాలని గిడుగు రామ్మూర్తి పరితపించారన్నారు. గిడుగు సంస్కరణ వాది అని, గ్రాంధీకం కట్లు తెంచి, ప్రజల భాష అమలుకు కృషి చేశారని తెలిపారు. పత్రికల్లో ఆయా ప్రాంత మాండలికాల్లో రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు. విల్సన్‌ మాట్లాడుతూ ప్రపంచంలో 80 శాతం దేశాల్లో మాతృభాషలో విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రపంచంలో ఏప్రాంతానికి వెళ్లినా తెలుగు వాళ్ల అస్తిత్వం భాషే అన్నారు. అనంతరం సాహితీవేత్తలను, 30 మంది కవులు, రచయితలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో 20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షుడు లంకా దినకర్‌, ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమి అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మక సాంస్కృతిక సమితి అధ్యక్షురాలు పొడపాటి తేజస్వి తదితరులు పాల్గొన్నారు.

Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 30 , 2026 | 05:49 AM