Share News

ఆదాయాన్ని మించిన ఖర్చు!

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:22 AM

రాష్ట్ర ప్రభుత్వం వస్తున్న ఆదాయానికి మించి భారీగా ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్‌-ఆగస్టు) పన్నులు, పన్నేతర, గ్రాంట్లు రూపంలో రాష్ట్రానికి రూ.72,787.67 కోట్ల ఆదాయం రాగా, రెవెన్యూ ఖర్చులు రూ.1,09,720 కోట్లకు చేరాయని కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది.

ఆదాయాన్ని మించిన ఖర్చు!

  • ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 72,787 కోట్లు

  • రెవెన్యూ ఖర్చులు 1,09,720 కోట్లు

  • తెచ్చిన అప్పులు 53,089 కోట్లు.. కాగ్‌ నివేదిక

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వస్తున్న ఆదాయానికి మించి భారీగా ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్‌-ఆగస్టు) పన్నులు, పన్నేతర, గ్రాంట్లు రూపంలో రాష్ట్రానికి రూ.72,787.67 కోట్ల ఆదాయం రాగా, రెవెన్యూ ఖర్చులు రూ.1,09,720 కోట్లకు చేరాయని కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. వచ్చిన ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ అంచనాల్లో 31శాతంగా ఉంది. ఇందులో పన్ను ఆదాయం రూ.66,037.94కోట్లు, పన్నేతర ఆదాయం రూ.2939 కోట్లు కాగా, గ్రాంట్లు రూ.3810 కోట్లు వచ్చాయి. ఈ 5నెలల కాలంలో రూ.53,089 కోట్ల అప్పులు తెచ్చారు. మొత్తం ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో ఇది 69.93 శాతం కావడం గమనార్హం. తొలి 5నెలల్లో అయిన రూ.1,09,720.38 కోట్ల రెవెన్యూ ఖర్చులు బడ్జెట్‌ అంచనాల్లో 42.84శాతం. మూలధన వ్యయం రూ.13,718 కోట్లు గా ఉంది. అప్పులు, ఆదాయం కలిపి ఈ 5నెలల్లో రూ.1,25,876.96 కోట్లు రాగా, మొత్తం ఖర్చులు రూ. 1,23,439 కోట్లకు చేరాయి. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 40.49 శాతం. రెవెన్యూలోటు రూ.36,932 కోట్లు (167.86 శాతం) గా నమోదైంది. కాగ్‌ నివేదిక ప్రకారం ప్రభుత్వం వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తుండగా.. ఆదాయానికి, ఖర్చులకు మధ్య వ్యత్యాసాన్ని అప్పులతో పూడ్చుతోంది.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 04:22 AM