Share News

దాడుల చరిత్ర జగన్‌ది.. ప్రజాస్వామ్య పాలన చంద్రబాబుది: బుద్దా వెంకన్న

ABN , Publish Date - May 10 , 2026 | 01:18 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పోస్టులు, రాష్ట్ర శాంతిభద్రతలపై చేస్తున్న విమర్శలపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..

దాడుల చరిత్ర జగన్‌ది.. ప్రజాస్వామ్య పాలన చంద్రబాబుది: బుద్దా వెంకన్న
Buddha Venkanna

విజయవాడ, మే 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పోస్టులు, రాష్ట్ర శాంతిభద్రతలపై చేస్తున్న విమర్శలపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా స్వేచ్ఛ, పోలీసుల పనితీరు గురించి మాట్లాడే కనీస అర్హత జగన్‌కు లేదని స్పష్టం చేశారు. వైసీపీ సోషల్ మీడియా వికృత చేష్టలకు స్వయంగా జగన్ సోదరి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలే బాధితులని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. జగన్‌తో విభేదించినందుకు వైఎస్సార్ బిడ్డ అని కూడా చూడకుండా ఆమె పుట్టుకపై నీచమైన పోస్టులు పెట్టించిన చరిత్ర జగన్‌ది అని విమర్శించారు. నాడు ఆ పోస్టులను సమర్థించి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నీతులు చెబుతున్నారు? అంటూ ధ్వజమెత్తారు.


గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ పిడేలు వాయించుకున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. పలు బహిరంగ సభల్లో కొడాలి నాని, జోగి రమేష్ వంటి వారు మహిళలపై బూతులతో విరుచుకుపడుతున్నా జగన్ ఆనందించారే తప్ప ఎన్నడూ వారించలేదని విమర్శించారు. మీ దాడులు, దౌర్జన్యాలు భరించలేకే ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. మాచర్ల దాడుల నుంచి అమాయక కార్యకర్తల హత్యల వరకు జగన్ హయాంలో సుమారు 2,800 మంది టీడీపీ కార్యకర్తలు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం.. మేము తలచుకుంటే మీరు ఇలా రంకెలు వేసే దమ్ముంటుందా? కానీ, దాడులకు ప్రతి దాడులు ఉండకూడదని చంద్రబాబు మమ్మల్ని ఆపుతున్నారు అని బుద్దా స్పష్టం చేశారు. జగన్ అండతో చట్టాలను ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారులు నేడు సస్పెండ్ అయి ఇంట్లో కూర్చున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్న జగన్.. తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శంషాబాద్ సమీపంలో దారి దోపిడి.. దొంగలు అరెస్ట్

అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్

For More AP News And Telugu News

Updated Date - May 10 , 2026 | 01:37 PM