జగన్‌కు మైండ్ పోయింది
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:27 AM
డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు ధర్నా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న అన్నారు. ఆ పార్టీ నాయకులు దేవినేని అవినాశ్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌లను ఆపడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు: బుద్దా వెంకన్న
విజయవాడ అర్బన్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు ధర్నా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న అన్నారు. ఆ పార్టీ నాయకులు దేవినేని అవినాశ్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌లను ఆపడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. సోమవారం విజయవాడ వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘వైసీపీ నాయకులు డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకున్న అభ్యర్థులకు ఆనందం లేకుండా చేస్తున్నారు. విజయవాడలో వైసీపీ నాయకులు మూడు గంటల పాటు అలజడులు సృష్టించారు. అదే వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ధర్నాలు చేయాలంటే అరె్‌స్టలు చేసేవారు.
డీఎస్సీపై చర్చకు సీఎం చంద్రబాబుని రమ్మంటావా? మంత్రి లోకేశ్‌ను రాజీనామా చేయమంటావా? జగన్‌కు దమ్ము ధైర్యం ఉంటే మంత్రి లోకేశ్‌తో చర్చకు రావాలి. జగన్‌కి మైండ్ పోయింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయటానికి వైసీపీకి అభ్యర్థులు కూడా లేరు. వైసీపీ నాయకులు పక్క జిల్లాల నుంచి విజయవాడకు రౌడీలను తెప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారు. జగన్... దమ్ముంటే డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులతో చర్చకు రాగలవా?’ అని బుద్దా సవాల్ విసిరారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక