Share News

కలియుగ కంసమామ జగన్‌

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:09 AM

బిందెడు పాలల్లో విషం చుక్క వేసినట్లు రాష్ట్ర అభివృద్ధిలో జగన్‌ విషపు చుక్కలు వేస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలంటే దౌర్జన్యాలు, అక్రమాలు, రిగ్గింగ్‌ చేయడమే జగన్మోహన్‌ రెడ్డికి తెలిసిన రాజకీయమని ధ్వజమెత్తారు.

కలియుగ కంసమామ జగన్‌

  • మేనకోడలి పెళ్లికి అడ్డుపడుతున్నాడు: బుద్దా వెంకన్న

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): బిందెడు పాలల్లో విషం చుక్క వేసినట్లు రాష్ట్ర అభివృద్ధిలో జగన్‌ విషపు చుక్కలు వేస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలంటే దౌర్జన్యాలు, అక్రమాలు, రిగ్గింగ్‌ చేయడమే జగన్మోహన్‌ రెడ్డికి తెలిసిన రాజకీయమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంటే అల్లర్లు సృష్టించి అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. జగన్‌ దాడులు గురించి మాట్లాడేటప్పుడు 2020 మాచర్లలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని కూడా ప్రస్తావించాలని స్పష్టం చేశారు.

2021 స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని జగన్‌ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ఆ ఎన్నికల్లో వైసీపీ విధ్వంసాన్ని దేశం మొత్తం చూసిందని చెప్పారు. ఆ ఎన్నికల్లో బలవంతంగా టీడీపీ అభ్యర్థులతో 1045 నామినేషన్లు ఉపసంహరింపచేశారని, 322 అక్రమ కేసులు పెట్టారని, 182 చోట్ల కోడ్‌ ఉల్లంఘించారని, మూడు హత్యలు, 48 హత్యాయత్నాలు చేశారని తెలిపారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కేసుల పేరుతో ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ‘తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు మేనమామ. వివాహ సంప్రదాయం ప్రకారం మేనమామే దగ్గరుండి మేనకోడలి పెళ్లి చేస్తారు. కానీ, మేనకోడలి పెళ్లికి స్థలం ఇవ్వకుండా అడ్డుపడిన కలియుగ కంసమామ జగన్‌. ఆస్తి కోసం చెల్లి, తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. ఆయనకు రాజకీయ విలువలు లేవు. మానవీయ విలువలు అసలు లేవు’ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 06:09 AM