టీడీపీ ఏజెంట్లపై వైసీపీ మూకలు దాడి చేయడం ప్రజాస్వామ్యమా?
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:21 AM
: ‘పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేశా రు? ఇది ప్రజాస్వామ్యమా?’ అని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ప్రశ్నించారు.
రెండు వాహనాలు ధ్వంసం చేశారు: బీటెక్ రవి
పులివెందుల టౌన్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేశా రు? ఇది ప్రజాస్వామ్యమా?’ అని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ప్రశ్నించారు. గురువారం జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అనంత రం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ ఏజెంట్లను 500 మంది రాళ్లతో, కట్టెలతో చుట్టుముట్టారు. ఏజెంట్ల కోసం వెళ్లిన రెండు వాహనాలను వైసీపీ మూకలు ధ్వంసం చేశాయి. పులివెందుల మండలంలోని ఎర్రిబల్లిలో దాడులు చేశారు. దాదాపు 400 మంది మహిళలను అడ్డుపెట్టుకుని వెనుకవైపు నుంచి కారంపొడి చల్లారు.
పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ రోజే అవినాశ్ వర్గం, రాఘవరెడ్డి నాయకత్వంలో రౌడీమూకలు, ప్రజలను బలవంతంగా తీసుకొచ్చారు. రాళ్ల దాడులు చేయడంతో ఫైరింగ్, టి యర్ గ్యాస్ ప్రయోగించే వరకు వచ్చింది. తిరిగి టీడీపీ నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. అలాగే వేంపల్లె మండలంలో ఆరు పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగింది. లింగాల మండలంలో ఎక్కడైనా టీడీపీ ఏజెంట్లు హింసకు పాల్పడినట్లు నిరూపించాలి. ఎన్నికలు ముగిశాయి. రాజకీయ విమర్శలు మానుకుని పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించాలి’ అని రవి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ