Share News

చదివింది బీటెక్.. చేసేది దొంగతనాలు.. చివరకు..

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:07 PM

బీటెక్ చదివి మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన యువకుడు.. లగ్జరీ జీవితానికి అలవాటుపడి చివరకు దొంగగా మారాడు. విజయవాడలో రూ.40 లక్షల విలువైన బంగారం చోరీ చేసి, పోలీసులకు దొరక్కుండా పక్కా స్కెచ్ వేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

చదివింది బీటెక్.. చేసేది దొంగతనాలు.. చివరకు..
BTech Graduate Arrested

విజయవాడ, సెప్టెంబర్ 13: నగరంలో బీటెక్ పూర్తి చేసిన 22 ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఈ నెల 5న బెంగళూరు వెటర్నరీ కాలనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. తన చిన్నారికి చికిత్స కోసం సెప్టెంబర్ 4న కుటుంబంతో కలిసి చెన్నై వెళ్లిన దినేష్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన మరీదు వినోద్ కుమార్.. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించాడు.


పోలీసులకు, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు చొక్కా విప్పి, బైక్ నంబర్ ప్లేట్ మార్చి మరీ చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్టు చేసి చోరీకి గురైన బంగారాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. లావిష్ లైఫ్‌స్టైల్‌ కోసం దొంగతనానికి పాల్పడిన వినోద్.. అప్పులు చేసి వాటి ఈఎంఐలు చెల్లించలేక చోరీకి దిగినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

Updated Date - Sep 13 , 2026 | 04:12 PM