చంద్రబాబు పనితీరు భేష్
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:09 AM
తెలంగాణలో కంటే ఏపీలో తక్కువ వర్షపాతం ఉందని.. అయినా అక్కడ కరువు లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) అన్నారు. అక్కడి సీఎం చంద్రబాబు ముందు చూపుతో నీళ్లు ఎత్తిపోసుకున్నారని, అందుకే కరువు, క్రాప్ హాలిడేలు లేవని వ్యాఖ్యానించారు.
ఏపీలో తక్కువ వర్షం
కురిసినా కరువు, క్రాప్ హాలీడేలు లేవు: కేటీఆర్
తెలంగాణలో కంటే ఏపీలో తక్కువ వర్షపాతం ఉందని.. అయినా అక్కడ కరువు లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) అన్నారు. అక్కడి సీఎం చంద్రబాబు ముందు చూపుతో నీళ్లు ఎత్తిపోసుకున్నారని, అందుకే కరువు, క్రాప్ హాలిడేలు లేవని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆయన తీరును అభినందిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో లోటు వర్షపాతం 17 నుంచి 20 శాతం మాత్రమే ఉందని, అయినా సీఎం రేవంత్‌రెడ్డి వల్లే కరువు వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రం కరువు, కరెంటు కోతలతో తల్లడిల్లుతుంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతో రేవంత్ తన ప్రచారం కోసం రూ.వేల కోట్లు వృథా చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు