రాష్ట్రానికి మరో మెగా ప్రాజెక్టు
ABN , Publish Date - Nov 29 , 2026 | 02:38 AM
రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలను కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భరోసా ఇస్తూ, రూ.1,26,656 కోట్లతో రామాయపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానున్నది.
1.26 లక్షల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్
రామాయపట్నంలో ఏర్పాటుకు బీపీసీఎల్ బోర్డు ఆమోదం
10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మాణం
యువతకు భారీ ఉద్యోగావకాశాలకు వీలు
స్వాగతించిన మంత్రి లోకేశ్
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలను కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భరోసా ఇస్తూ, రూ.1,26,656 కోట్లతో రామాయపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు శనివారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, యువత భవితకు లభించిన భరోసాగా ఈ నిర్ణయాన్ని మంత్రి లోకేశ్ స్వాగతించారు.
గ్రీన్‌ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ 2032 నాటికి పూర్తిగా వినియోగంలోకి వస్తుందని బీపీసీఎల్ బోర్డు అంచనా వేసింది. ఏటా తొమ్మిది మిలియన్ టన్నుల క్రూడ్ సామర్థ్యం ఈ కాంప్లెక్స్ సొంతం. అదనంగా మరో 1.5 మిలియన్ టన్నుల మిక్స్‌డ్-ఫీడ్ ఇథిలీన్ క్రాకర్, డౌన్ స్ట్రీమ్ పెట్రోకెమికల్ యూనిట్లను కూడా కలుపుకొంటే, దీని సామర్థ్యం 10.5 మిలియన్ టన్నులకు చేరుతుంది. కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే, విదేశాల నుంచి పెట్రో కెమికల్ ఉత్పత్తుల దిగుమతి అవసరం తగ్గుతుంది. రామాయపట్నం కేంద్రంగా దేశవ్యాప్తంగా పెట్రో కెమికల్ ఫ్యూయల్, పాలీమర్‌ను డిమాండ్‌కు తగ్గట్టుగా అందించే వీలుంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..