పీఆర్‌పీతో ప్రజలకు ప్రయోజనం లేదు
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:40 AM
విజయసాయిరెడ్డి కొత్తగా ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
జగన్‌ది దివాలాకోరుతనం: ఎంపీ పురందేశ్వరి
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): విజయసాయిరెడ్డి కొత్తగా ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ‘జగన్ పాలనలో విజయసాయిరెడ్డి పరివర్తన, రాజనీతి ఏమైపోయాయి? ఆనాడు జగన్‌కు అనుకూలంగా మధ్యవర్తిత్వం చేసి అక్రమాలకు పాల్పడడాన్ని ప్రజలు మర్చిపోలేదు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కున్నారంటూ జగన్ చేస్తున్న ఆరోపణలు ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనం. సమన్వయలోపం వల్లే పరిషత్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఓటమి చెందారు’ అని పురందేశ్వరి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు