ఈఆర్సీ చైర్మన్‌గా బినోయ్ కుమార్
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:58 AM
ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 బ్యాచ్‌కు చెందిన బినోయ్ ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. డిప్యుటేషన్‌పై కేంద్రానికి వెళ్లిన ఆయన ఉక్కుశాఖలో కార్యదర్శిగా, విదేశీ వ్యవహారాల శాఖలో అదనపు కార్యదర్శిగా, రక్షణశాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో బినోయ్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించారు. ఆయన 2020లో ఉద్యోగవిరమణ చేశారు. బినోయ్ ఈఆర్సీ చైర్మన్ పదవిలో 5 ఏళ్లు లేదా 70 ఏళ్ల వయసు వరకు ఉంటారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం