Share News

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొని నలుగురి మృతి

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:16 AM

విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అధికారులు గుర్తించారు.

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొని నలుగురి మృతి
Vizianagaram Accident

విజయనగరం, నవంబరు 24: జిల్లాలోని భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రిలయన్స్ డిజిటల్ మేనేజర్ ఓకలపూడి శ్రీనివాస్, బోర సతీష్, శృతి, కుసుమ రంజనిగా గుర్తించారు. వీరంతా విశాఖ జిల్లా తగరపువలస పరిసర ప్రాంతాలకు చెందినవారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల బ్యాగుల్లో నగదు, విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గురైన థవేరా కారు అర్ధరాత్రి 12.50 గంటలకు శ్రీకాకుళం వైపు వెళ్లి, తిరిగి ఉదయం 7.35 గంటలకు భోగాపురం టోల్‌గేట్ దాటినట్లు రికార్డుల్లో నమోదైంది.


ఈ ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను కోరారు. క్షతగాత్రుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.

మరోవైపు.. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాహనదారులు రహదారులపై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

నిమ్స్‌లో అడుగడుగునా అవినీతి

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 24 , 2026 | 12:01 PM