Share News

ఖరీదైన కౌన్సిలర్‌ పదవి!

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:50 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను మించిపోతున్నాయి. భీమవరం పట్టణంలో కౌన్సిలర్‌గా జనరల్‌ కేటగిరీలో పోటీ చేయాలంటే రూ.20లక్షలు...

ఖరీదైన కౌన్సిలర్‌ పదవి!

  • భీమవరంలో పోటీకి రూ.20లక్షలు ఉండాల్సిందే!

తాడేపల్లిగూడెం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను మించిపోతున్నాయి. భీమవరం పట్టణంలో కౌన్సిలర్‌గా జనరల్‌ కేటగిరీలో పోటీ చేయాలంటే రూ.20లక్షలు సమకూర్చుకోవాలని నాయకులు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు వంటి మున్సిపాల్టీల్లో వార్డుకు పోటీ చేయాలంటే రూ.10 లక్షలు చూసుకోవాలని నేతలు సూచిస్తున్నారు. ప్రధానంగా జనరల్‌ వార్డుల్లోనే డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

కాగా, నామినేషన్‌ వేసినప్పటి నుంచి కార్యకర్తలను పలు రకాలుగా సంతృప్తి పరచాలంటే ఈ భారం మరింతగా పెరిగే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక.. ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో పోటీ చేయాలంటే రూ.5 లక్షలుగా నేతలు నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు మునిసిపాలిటీల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 01:53 AM