Share News

20 నుంచి భవానీ దీక్షాధారణ

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:52 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 20 నుంచి భవానీ దీక్షల మాలధారణ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి మూడో తేదీన దీక్షా విరమణ ఉంటుంది. మండల దీక్షాధారణ 20వ తేదీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 8.45 గంటలకు మొదలై 24తో ముగుస్తుంది.

 20 నుంచి భవానీ దీక్షాధారణ

  • జనవరి మూడున దీక్ష విరమణ

విజయవాడ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 20 నుంచి భవానీ దీక్షల మాలధారణ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి మూడో తేదీన దీక్షా విరమణ ఉంటుంది. మండల దీక్షాధారణ 20వ తేదీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 8.45 గంటలకు మొదలై 24తో ముగుస్తుంది. అర్ధ మండల దీక్షాధారణ డిసెంబరు 10న ప్రారంభమైన 14తో ముగుస్తుంది. డిసెంబరు 24న సాయంత్రం 6.30 గంటలకు సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి కలశ జ్యోతి ఉత్సవం ప్రారంభమవుతుంది. డిసెంబరు 30 నుంచి జనవరి 3 వరకు మండల దీక్ష విరమణలు జరుగుతాయి. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణ ఉంటాయి. జనవరి మూడో తేదీన పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ పూర్తవుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:52 AM