టార్గెట్ల వేధింపులు తాళలేక.. బ్యాంకులోనే మేనేజర్ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:52 AM
టార్గెట్లు పూర్తిచేయాలంటూ పై అధికారులు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ మేనేజర్ బ్యాంకులోనే ఆత్మహత్యకు యత్నించారు
విజయవాడ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): టార్గెట్లు పూర్తిచేయాలంటూ పై అధికారులు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ మేనేజర్ బ్యాంకులోనే ఆత్మహత్యకు యత్నించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు ఈశ్వర్ బ్రాంచ్ మేనేజర్‌గా ఉన్నారు. ఖాతాలు తెరవడంతో పాటు బీమా లక్ష్యాలను పూర్తిచేయాలని ఉన్నతాధికారులు తరచూ వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఈశ్వర్ సోమవారం మధ్యాహ్నం తన చాంబర్‌లోనే పురుగు మందు తాగారు. సిబ్బంది గుర్తించి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్