బియ్యపు గింజపై దుర్గాదేవి ముఖ చిత్రం
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:15 AM
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నైదండ గోపాల్ బియ్యపు గింజపై దుర్గాదేవి ముఖ చిత్రం ఆవిష్కరించి తన ప్రావీణ్యాన్ని మరోమారు చాటుకున్నాడు.
మాడుగుల రూరల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నైదండ గోపాల్ బియ్యపు గింజపై దుర్గాదేవి ముఖ చిత్రం ఆవిష్కరించి తన ప్రావీణ్యాన్ని మరోమారు చాటుకున్నాడు. బూతద్దం సాయంతో మూడు గంటలు శ్రమించి దుర్గాదేవి రూపాన్ని బియ్యపు గింజపై చెక్కి, వాటర్ కలర్స్ అద్దాడు. ఈ కళాఖండం ద్వారా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు గోపాల్ తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు