నేడు గ్రూప్-2 సమగ్ర నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:42 AM
గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ.. మంగళవారం సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
720 పోస్టులు భర్తీ చేయనున్న ఏపీపీఎస్సీ
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ.. మంగళవారం సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 30 కేటగిరీల్లో 720 పోస్టులను ఈ ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కాగా, తొలుత విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్‌లో 686 పోస్టులే భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అయితే, పలు శాఖల్లో పోస్టులు పెరగడంతో ఆ సంఖ్య 720కు చేరింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు రుసుము, పరీక్షల తేదీలు, ఫలితాల వెల్లడి వంటి సమగ్ర వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో ఏపీపీఎస్సీ వివరించనుంది.
ఈ వార్తలనూ చదవండి: