శ్రీవారి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభించాం: ప్రతాప్ సీ రెడ్డి
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:32 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభించామని సంస్థ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి చెప్పారు.
శ్రీవారి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభించాం: ప్రతాప్ సీ రెడ్డి
తిరుమల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభించామని సంస్థ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి చెప్పారు. కుమార్తె ప్రీతారెడ్డి, మనవరాలైన హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తదితరులతో కలిసి ఆయన బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. అపోలో హాస్పిటల్స్ అభివృద్ధికి ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట