Share News

మోదీ.. ప్రజాస్వామ్య హంతకుడు: షర్మిల

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:36 AM

ప్రధాని మోదీ ప్రజాస్వామ్య హంతకుడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని కోరుతూ శనివారం లోక్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించాలనుకున్న షర్మిలను ఇంటి వద్దే పోలీసులు అరెస్టు చేశారు.

మోదీ.. ప్రజాస్వామ్య హంతకుడు: షర్మిల

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ప్రజాస్వామ్య హంతకుడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని కోరుతూ శనివారం లోక్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించాలనుకున్న షర్మిలను ఇంటి వద్దే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు ఉండాలి, ఇలాంటి ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం తొలగిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 13.40 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని నిలదీశారు. ఫారం 6,7లను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం మోదీ చెప్పినట్లుగా పని చేస్తోందని ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 03:36 AM