Share News

ట్రాఫిక్‌ చలాన్ల దారి మళ్లింపు కేసు విచారణ 16కు వాయిదా

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:08 AM

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన ట్రాఫిక్‌ చలాన్ల దారి మళ్లింపు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ పోలీసు శాఖకు ఈ-చలాన్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ను సరఫరా చేసి,...

ట్రాఫిక్‌ చలాన్ల దారి మళ్లింపు కేసు విచారణ 16కు వాయిదా

న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన ట్రాఫిక్‌ చలాన్ల దారి మళ్లింపు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ పోలీసు శాఖకు ఈ-చలాన్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ను సరఫరా చేసి, నిర్వహించేందుకు 2018లో ‘డేటా ఇవాల్వ్‌’ సంస్థకు మూడేళ్ల కాల పరిమితితో కాంట్రాక్ట్‌ దక్కింది. ఈ ఒప్పందం గడువు 2021 డిసెంబర్‌ 31తో ముగిసింది. ఆ తర్వాత కాంట్రాక్టును పునరుద్థరించనప్పటికీ, సదరు సంస్థ అనధికారికంగా ఆ సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థను నిర్వహిస్తూ వచ్చిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ట్రాఫిక్‌ చలాన్ల రూపంలో వసూలైన సుమారు రూ.37 కోట్ల ప్రజాధనాన్ని దారి మళ్లించిందని ఆరోపిస్తూ క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది.

ఈ క్రమంలో పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, సేవల కొనసాగింపు తదితర అంశాల్లో వివాదాలు తలెత్తాయని, వీటి పరిష్కారానికి ఆర్బిట్రేటర్‌ను నియమించాలని కోరుతూ సదరు సంస్థ గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వివాద పరిష్కారానికి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయిని ఏకసభ్య ఆర్బిట్రేటర్‌గా నియమించింది. ఈ ఆర్బిట్రేటర్‌ నియామక ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ 13 ఫిబ్రవరి 2026న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ నేతృత్వంలోని జస్టిస్‌ వి.మోహనతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది విచారణను వాయిదా వేయాలని కోరడంతో అంగీకరించింది.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:08 AM