Share News

మిగతా 23 పట్టణ సంస్థలకూ ఎన్నికలు!

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:47 AM

రాష్ట్రంలో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించని 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు తాజాగా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నిర్ణయించినట్లు తెలిసింది.

మిగతా 23 పట్టణ సంస్థలకూ ఎన్నికలు!

  • వీటిలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించని 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు తాజాగా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నిర్ణయించినట్లు తెలిసింది. 123 పట్టణ స్థానిక సంస్థలకుగాను ఇటీవల 100 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాలు తేలడంతో మిగిలిన 23 స్థానిక సంస్థలకు.. 26న ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ యోచిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం (13న) నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలు 26నే జరుగనున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు.. ఆమదాలవలస(శ్రీకాకుళం జిల్లా), రాజాం (విజయనగరం), పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు(పశ్చిమ గోదావరి), చింతలపూడి(ఏలూరు), గుడివాడ, తాడిగడప(కృష్ణా), పొన్నూరు(గుంటూరు), బాపట్ల(బాపట్ల),నరసరావుపేట(పల్నాడు), పొదిలి(మార్కాపురం), కందుకూరు(ప్రకాశం), కావలి, అల్లూరు(నెల్లూరు), గూడూరు, శ్రీకాళహస్తి(తిరుపతి), బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా) మున్సిపాలిటీలకు ఆ రోజు పోలింగ్‌ జరుగనుంది. ఈ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

23 చోట్లా రిజర్వేషన్‌ ఇలా..

కార్పొరేషన్లలో శ్రీకాకుళం-జనరల్‌ (మహిళ), రాజమహేంద్రవరం-ఎస్సీ (జనరల్‌), కాకినాడ-బీసీ (మహిళ), మంగళగిరి-తాడేపల్లి-ఎస్టీ (జనరల్‌)కు రిజర్వ్‌ చేశారు. మున్సిపాలిటీల్లో ఆమదాలవలసను జనరల్‌ (మహిళ)కు, రాజాం-బీసీ (మహిళ), భీమవరం-జనరల్‌ (మహిళ), తాడేపల్లిగూడెం-జనరల్‌ (అన్‌రిజర్వ్‌డ్‌), తణుకు-జనరల్‌ (అన్‌రిజర్వ్‌డ్‌), పాలకొల్లు-బీసీ (మహిళ), చింతలపూడి-ఎస్సీ (మహిళ), గుడివాడ-బీసీ (మహిళ), తాడిగడప-బీసీ (జనరల్‌), పొన్నూరు-జనరల్‌ (మహిళ), బాపట్ల-ఎస్సీ (జనరల్‌), నరసరావుపేట-జనరల్‌ (అన్‌రిజర్వ్‌డ్‌), పొదిలి-ఎస్సీ (జనరల్‌), కందుకూరు-జనరల్‌ (అన్‌రిజర్వ్‌డ్‌), కావలి-జనరల్‌ (అన్‌రిజర్వ్‌డ్‌), అల్లూరు-ఎస్టీ (జనరల్‌), గూడూరు-ఎస్టీ (మహిళ), శ్రీకాళహస్తి-బీసీ (జనరల్‌), బి.కొత్తకోటను బీసీ (మహిళ)కు కేటాయించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 01:54 AM