‘టెట్’లో 52 శాతం టీచర్లు పాస్
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:31 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 37,789 మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 72,288 మంది ఉపాధ్యాయులు వివిధ పేపర్లకు సంబంధించిన పరీక్షలు రాయగా.. వీరిలో 52 శాతం మంది ఉత్తీర్ణులు కావడం గమనార్హం.
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 37,789 మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 72,288 మంది ఉపాధ్యాయులు వివిధ పేపర్లకు సంబంధించిన పరీక్షలు రాయగా.. వీరిలో 52 శాతం మంది ఉత్తీర్ణులు కావడం గమనార్హం. సాధారణ అభ్యర్థులు 42.3శాతం మంది పాసయ్యారు. కాగా, టెట్ ఫలితాలను టెట్-2026 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఆదివారం విడుదల చేశారు. టెట్ పరీక్షలకు 2,14,486 మంది 2,38,252 పేపర్లకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్ల పరీక్షలకు హాజరయ్యారు. 90,862 మంది అభ్యర్థులు 99,591 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. కాగా, వారిలో 37,789 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు. మొత్తం 74,711 మంది టీచర్లు 84,798 పేపర్ల కోసం టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 72,288 మంది పరీక్షలు రాశారు. 37,789 మంది 41,315 పేపర్లలో టెట్ అర్హత సాధించారు. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఫలితాలు చూసుకోవచ్చని కన్వీనర్ సూచించారు.
‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో టెట్ అర్హత సాధించాల్సిన ఇన్ సర్వీస్ టీచర్లు 80 వేలకు పైగా ఉన్నారు. వారిలో ఇప్పుడు దాదాపు 38 వేల మంది అర్హత సాధించారు. మిగిలిన టీచర్లు రెండేళ్లలో అర్హత సాధించాల్సి ఉంది. కాగా, టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక టెట్ కూడా పూర్తయితే ఇన్ సర్వీస్ టీచర్లు చాలా మంది అర్హత సాధించే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’