19 మంది సాహితీవేత్తలకు తెలుగు భాషా పురస్కారాలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:52 AM
గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పురస్కారాలు అందించనుంది.
నేడు తెలుగు భాషా దినోత్సవంలో అందజేత
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పురస్కారాలు అందించనుంది. సాహిత్యంలో 19 మంది ప్రముఖులకు అవార్డులు ప్రకటించింది. పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్ శుక్రవారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వాసిరెడ్డి వేంకటాద్రి యూనివర్సిటీ, డా.జంధ్యాల కనకదుర్గ, ముత్తేవి రవీంద్రనాథ్, అబ్దుల్ హకీమ్‌జానీ, పి.విజయకుమార్ (గుంటూరు జిల్లా), చందులూరి నారాయణరావు (బాపట్ల), యు.భూదేవి(అన్నమయ్య), కె.పుష్ప (చిత్తూరు), బాలాంత్రపు వెంకట రమణ, ఎస్.వి.రాఘవేంద్రరావు (కాకినాడ), బొగ్గవరపు మాల్యాద్రి (నెల్లూరు), చిలుకూరి శ్రీనివాసరావు (తూర్పుగోదావరి), నాగసూరి వేణుగోపాలరావు (అనంతపురం), జంధ్యాల శరత్‌బాబు (విజయనగరం), కోయి కోటేశ్వరరావు (ఒంగోలు), కె.వి.ఎల్.ఎస్.శర్మ (ఎన్టీఆర్ జిల్లా), ఎమ్.రామకృష్ణ (విశాఖపట్నం), వేమూరి శ్రీనివాస్, కొల్లి రమావతి (పశ్చిమగోదావరి) ఎంపికయ్యారు. శనివారం ప్రభుత్వం నిర్వహించే తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో వీరందరికి పురస్కారాలు అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం.
ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం