Share News

‘సెమీకండక్టర్‌’ పెట్టుబడులపై రాష్ట్రం దృష్టి

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:52 AM

సెమీకండక్టర్‌ తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణపై మన రాష్ట్రం దృష్టి సారించింది. సెమీకండక్టర్ల ఉత్పత్తిలో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న తైవాన్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘సెమీకండక్టర్‌’ పెట్టుబడులపై రాష్ట్రం దృష్టి

  • నేటి నుంచి ఢిల్లీలో సెమీకాన్‌ ఇండియా-2026

  • భాగస్వామ్యం కానున్న రాష్ట్ర ఐటీ శాఖ

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సెమీకండక్టర్‌ తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణపై మన రాష్ట్రం దృష్టి సారించింది. సెమీకండక్టర్ల ఉత్పత్తిలో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న తైవాన్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గురు, శుక్రవారాల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీకాన్‌ ఇండియా-2026లో భాగస్వామ్యం కావాలని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ నేతృత్వంలోని బృందం ఈ సెమినార్‌లో పాల్గొంటోంది. సెమీకాన్‌ ఇండియా-26లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పెవిలియన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ ద్వారా గ్లోబల్‌ సెమీకండక్టర్‌ తయారీదారులతో ముఖాముఖి చర్చలు జరిపేందుకు ఐటీ శాఖ సిద్దమైంది. తార్క్‌ సెమీకండక్టర్‌, టెరాడైన్‌ సంస్థలతో ముఖాముఖి సంప్రదింపులను భాస్కర్‌ నిర్వహిస్తారు. యూఎస్-ఇండియా, జపాన్‌-ఇండియా రౌండ్‌ టేబుల్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమవుతుంది. పెట్టుబడులతో రాష్ట్రానికి రప్పించేందుకు గ్లోబల్‌ దిగ్గజ సంస్థ యూఎ్‌సఐబీసీ సెమీకండక్టర్‌తోనూ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపనుంది.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 04:52 AM