సాంఘిక సంక్షేమ శాఖ సర్వీస్ రూల్స్‌లో సవరణలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:28 AM
ఏపీ సాంఘిక సంక్షేమశాఖ సబార్డినేట్ సర్వీస్ రూల్స్- 1996 లో ప్రభుత్వం సవరణలు చేసింది. ఇవి జూలై 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు శుక్రవారం పేర్కొంది. ప్రస్తుత సర్వీ సు రూల్స్‌లోని క్లాస్-ఏలో కేటగిరి-2ను తొలగించారు.
క్లాస్-ఏలోని కేటగిరీల్లో పోస్టుల హోదాల మార్పు
కేటగిరీ-11గా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ పోస్టు
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏపీ సాంఘిక సంక్షేమశాఖ సబార్డినేట్ సర్వీస్ రూల్స్- 1996 లో ప్రభుత్వం సవరణలు చేసింది. ఇవి జూలై 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు శుక్రవారం పేర్కొంది. ప్రస్తుత సర్వీ సు రూల్స్‌లోని క్లాస్-ఏలో కేటగిరి-2ను తొలగించారు. కేటగిరీ-3లో ఉన్న వార్డెన్ గ్రేడ్-1, మ్యాట్రన్ గ్రేడ్-1 హోదాల ను ఇకపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1గా మార్చారు. అలాగే కేటగిరీ-4లోని వార్డెన్ గ్రేడ్-2, మ్యాట్రన్ గ్రేడ్-2 హోదాలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2గా మార్పు చేశారు. కింది కేటగిరీ, క్లాస్ లేదా గ్రేడ్ నుంచి పైస్థాయి కేటగిరీ, క్లాస్ లేదా గ్రేడ్‌కు పదోన్నతి లేదా బదిలీ నియామకం పొందాలంటే కనీసం 2 సర్వీసు పూర్తి చేసి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్లాస్-ఏ లోని కేటగిరి-4కు ప్రత్యక్ష నియామకం ద్వారా ఎంపికయ్యే ఉద్యోగులు తమ ప్రొబేషన్ కాలంలో అక్కౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్-1లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. క్లాస్-సి కేటగిరీలకు నియామక యూనిట్లను 6 జోన్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2025లో అమల్లోకి వచ్చిన కొత్త స్థానిక కేడర్ విధానానికి అనుగుణంగా రూల్స్‌ను సవరించడంలో భాగంగా మార్పులు చేపట్టినట్లు పేర్కొంది.
కొత్తగా కేటగిరీ-11..
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టును కేటగిరీ-11గా చేర్చారు. ఈ పోస్టును ప్రత్యక్ష నియామకం ద్వారా, సాంఘిక సంక్షేమ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 నుంచి బదిలీ నియామకం ద్వారా భర్తీ చేసేలా సాంఘిక సంక్షేమశాఖ మరో జీవో జారీ చేసింది. కేటగిరి-11లో ప్రత్యక్ష నియామకం పొందిన ఉద్యోగులు ప్రొబేషన్ కాలంలో అక్కౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్-1, రెవెన్యూ టెస్ట్ పార్ట్-1లోని మొదటి పేపర్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నియామక యూనిట్లను 6 జోన్లుగా నిర్దేశించింది. ఈ పోస్టులకు నియామక అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉంటారు. ప్రత్యక్ష నియామకానికి సంబంధించిన పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు