విద్యుత్తు వినియోగంలో ఊరట
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:43 AM
రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఆదివారం ఊరట లభించింది. విద్యుత్తు వినియోగం ఒక్కసారిగా 240 మిలియన్ యూనిట్లకు పడిపోయింది.
240 మిలియన్ యూనిట్లకు తగ్గిపోయిన వాడకం
రెండు నెలల వ్యవధిలో ఇదే అతి తక్కువ వినియోగం
240 మిలియన్ యూనిట్లకు తగ్గిన వాడకం
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఆదివారం ఊరట లభించింది. విద్యుత్తు వినియోగం ఒక్కసారిగా 240 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఈ నెల ప్రారంభంలో నమోదైన 297 మిలియన్ యూనిట్ల గరిష్ఠ వినియోగంతో ఉక్కిరిబిక్కిరి అయిన విద్యుత్తు సంస్థలకు ఉపశమనం లభించినట్లయింది. ఈ నెల 12 నుంచే విద్యుత్తు వినియోగం తగ్గుతూ వచ్చింది. 297 నుంచి 280, 270, 260 మిలియన్ యూనిట్లుగా నమోదవుతూ వచ్చిన విద్యుత్తు వినియోగం ఆదివారం ఒక్కసారిగా 240 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. విద్యుత్తు వినియోగం భారీగా తగ్గినా థర్మల్ స్టేషన్లపై మాత్రం భారం తగ్గలేదు. థర్మల్ స్టేషన్లు పూర్తి సామర్థ్యంతో 111 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక