Share News

వేతన సవరణకు మార్గం సుగమం: రామకృష్ణ

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:52 AM

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గత నెల 5న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇచ్చిన హామీల మేరకు పీఆర్సీ కమిషన్‌ వేయడంతో ఉద్యోగుల వేతన సవరణకు మార్గం సుగమం అయ్యిందని ..

 వేతన సవరణకు మార్గం సుగమం: రామకృష్ణ

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గత నెల 5న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇచ్చిన హామీల మేరకు పీఆర్సీ కమిషన్‌ వేయడంతో ఉద్యోగుల వేతన సవరణకు మార్గం సుగమం అయ్యిందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. పీఆర్సీ కమిషన్‌ నియామకంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రెండు డీఏలు చెల్లించడం, పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ను పునరుద్ధరించడం, ఉద్యోగుల నుంచి ప్రతినెలా మినహాయిస్తున్న ఈహెచ్‌ఎస్ వాటాను ఎన్‌టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌కు జమ చేయడం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, వాటిని వేగంగా కార్యరూపంలోకి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:55 AM