Share News

డిసెంబరు 21లోగా వ్యయ వివరాలు ఇవ్వండి

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:46 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ (గెలిచినవారు, ఓడినవారు) తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను డిసెంబరు 21లోగా...

డిసెంబరు 21లోగా వ్యయ వివరాలు ఇవ్వండి

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ఎస్‌ఈసీ సూచన

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ (గెలిచినవారు, ఓడినవారు) తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను డిసెంబరు 21లోగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 230-బి ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థీ ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించేందుకు డిసెంబరు 21 తేదీని చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. గడువులోగా సమర్పించని అభ్యర్థులు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతకు గురవుతారని తెలిపారు. ఎన్నికై ఉంటే, పదవి కూడా కోల్పోతారని స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 03:53 AM