Share News

1-2 తరగతులకు హోంవర్క్‌ వద్దు

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:45 AM

బడికి వెళ్లే విద్యార్థుల బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు హోంవర్క్‌ విషయంలో పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసింది.

1-2 తరగతులకు హోంవర్క్‌ వద్దు

  • 3-5 తరగతులకు వారానికి 2 గంటలే ఇవ్వాలి

  • పాఠశాల విద్యాశాఖ స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): బడికి వెళ్లే విద్యార్థుల బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు హోంవర్క్‌ విషయంలో పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. 1,2 తరగతుల వారికి హోంవర్క్‌ ఇవ్వొద్దని, 3-5 తరగతులకు వారానికి రెండు గంటలకు మించకుండా, 6-8 తరగతులకు రోజుకు గంట, ఆపై తరగతులకు రోజుకు రెండు గంటల హోంవర్క్‌ మాత్రమే ఇవ్వాలని సూచించింది. స్కూల్‌ బ్యాగ్‌ బరువులు పెరిగిపోవడం వల్ల విద్యార్థులు వాటిని మోయలేకపోతున్నారని, అధిక బరువుతో తరచూ పడిపోతున్నారని పేర్కొంది. స్కూల్‌ బ్యాగ్‌ బరువు అనేది విద్యార్థి శరీర బరువులో 10 శాతం మించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను కలిపేసి బరువు తగ్గించామని వివరించింది. స్కూల్‌ బ్యాగ్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని, రెండు వైపులా తగిలించుకునే బ్యాగులనే అనుమతించాలని, ఒకవైపు భుజానికి తగిలించుకునే బ్యాగులు తీసుకురాకుండా చూడాలని స్పష్టం చేసింది. స్కూల్‌ బ్యాగ్‌కు బరువుకు ప్రత్యేకంగా రిజిస్టర్‌ నిర్వహించాలని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 04:48 AM