మా ప్లాట్లను పునరుద్ధరించాలి: ఎస్సీ, ఎస్టీ వ్యాపారులు
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:21 AM
ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో తమకు కేటాయించిన ప్లాట్లను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు అన్నారు.
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో తమకు కేటాయించిన ప్లాట్లను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు అన్నారు. రద్దు చేసిన ప్లాట్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ చైర్మన్ ఇ.అనార్‌బాబు బుధవారం సీఎంకు లేఖ రాశారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ ఎండీ దినేశ్‌కుమార్‌కు ఆ లేఖ ప్రతులను అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి..