సర్పంచ్ కుర్చీ కోసం 1.2 కోట్లు
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:55 AM
విశాఖపట్నం జిల్లా ఆనందపురం పంచాయతీ సర్పంచ్ కుర్చీ రూ.1.2 కోట్ల ధర పలికింది! సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుదారు మీసాల పైడిరాజు...
గ్రామాభివృద్ధికి సొమ్ము ఇచ్చేలా ఒప్పందం
ఆనందపురం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా ఆనందపురం పంచాయతీ సర్పంచ్ కుర్చీ రూ.1.2 కోట్ల ధర పలికింది! సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుదారు మీసాల పైడిరాజు, వైసీపీ మద్దతుదారు సినగం అనసూయ నామినేషన్లు వేశారు. వీరిద్దరూ మహిళలే. తొలుత పైడిరాజు గ్రామాభివృద్ధి కోసం రూ.కోటి ఇవ్వడానికి ముందుకువచ్చారు. అనసూయ మరికొంత ఎక్కువ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
దీంతో పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పైడిరాజు రూ.1.2 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సూచనతో అనసూయ తన నామినేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీంతో మీసాల పైడిరాజు ఒక్కరే బరిలో ఉండడంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే పంచాయతీ పరిధిలో 12 వార్డు సభ్యుల పదవులకు పోటీ ఉండడంతో వాటికి ఎన్నికలు జరుగుతాయి.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..