సర్పంచ్ @ 99 లక్షలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:32 AM
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహదేవపురంలో పంచాయతీ సర్పంచ్ పదవికి వే లం నిర్వహించారు. టీడీపీ వర్గీయుడైన దామా శ్రీనివాసులు రూ. 99 లక్షలు పాట పాడి ఏకగ్రీవం గా దక్కించుకున్నారు.
కందుకూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహదేవపురంలో పంచాయతీ సర్పంచ్ పదవికి వే లం నిర్వహించారు. టీడీపీ వర్గీయుడైన దామా శ్రీనివాసులు రూ. 99 లక్షలు పాట పాడి ఏకగ్రీవం గా దక్కించుకున్నారు. టీడీపీకి మంచి పట్టున్న ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఈసారి జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. దీంతో టీడీపీకి చెందిన పలువురు పోటీపడ్డారు. టీడీపీలోని వర్గ రాజకీయంతో విజేతలుగా నిలవవచ్చన్న ఆలోచనతో వైసీపీ వారు కూడా సర్పంచ్ బరి లో నిలిచారు.
దీంతో ఈ గ్రామంలో మొత్తం 17 మం ది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దీంతో పరిస్థితిని గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే ఇంటూ రి నాగేశ్వరరావు జోక్యం చేసుకుని రెండు రోజులుగా జరిపిన చర్చలు ఫలించాయి. వేలం పాటలో ఎవరు హెచ్చు పాడితే వారికే సర్పంచ్ పదవిని వదిలేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనికి వైసీపీ వర్గీయులు కూడా అంగీకరించారు. దీంతో వేలం నిర్వహించగా దామా శ్రీనివాసులు రూ.99 లక్షలకు హెచ్చుపాట పాడి సొమ్ము ఇచ్చేశారు. ఈ మొత్తాన్ని అభివృద్ధికి వెచ్చించాలని నిర్ణయించారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..