ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ కార్మికులందరికీ న్యాయం చేయాలి
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:44 AM
రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరికీ న్యాయం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ...
బస్‌స్టేషన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరికీ న్యాయం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాసరి కిరణ్‌కుమార్, పి.గంగాజనేయులు ఆర్టీసీ యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అన్నమయ్య జిల్లా రాయచోటి డిపో ఆర్టీసీ గ్యారేజ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ఔట్‌సోర్సింగ్ కార్మికురాలు భారతి(33) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు ఇస్మాయిల్(23), సుధాకర్(42) తీవ్రంగా గాయపడ్డారు.
యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా నిబంధనలు పాటించకపోవటం వల్ల ఈ ఘోరం జరిగింది. మృతురాలి భారతి కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పీఎఫ్, ఈఎ్‌సఐ బీమా మొత్తాలను వెంటనే చెల్లించాలి. భారతి ఇద్దరు కుమారుల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. క్షతగాత్రులకు ఉచిత వైద్య చికిత్సతోపాటు, వారు కోలుకునేవరకూ పూర్తి వేతనం చెల్లించాలి’ అని వారు డిమాండ్ చేశారు.
అలాగే, రాష్ట్రంలో ఉన్న 8,500 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులందరికీ జీవిత బీమా, ఈఎస్ఐ, పీఎఫ్, ఆర్టీసీ వైద్య సదుపాయం, ఉచిత బస్‌పాస్ తప్పనిసరిగా అమలుచేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి