రోగి భద్రతలో ఏపీకి అగ్రస్థానం
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:29 AM
రోగి భద్రతలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 86 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో అత్యధిక సగటుతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది.
తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, డయ్యూ-డామన్
ప్రపంచ రోగి భద్రతా దినోత్సవంలో ప్రకటించిన కేంద్రం
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రోగి భద్రతలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 86 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో అత్యధిక సగటుతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది గుర్తింపుగా నిలిచింది. ఏపీ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, డామన్ - డయ్యూ, తమిళనాడు టాప్-5లో ఉన్నాయి. రాష్ట్ర నాణ్యతా విభాగం, జిల్లా నాణ్యతా బృందాలు, ఆస్పత్రులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయడంతోనే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రి సత్యకుమార్ అభినందించారు. రోగి భద్రతను ప్రభుత్వ వైద్యసంస్థల్లో నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ నాణ్యతా ప్రమాణాలను మరింత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: