Share News

​బి-ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల కల్పనకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ బిగ్ ప్లాన్!

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:05 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బి-ఫార్మసీ విద్యార్థులకు ఫార్మా రంగంలో మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఒక కీలకమైన అడుగు వేసింది.

​బి-ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల కల్పనకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ బిగ్ ప్లాన్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బి-ఫార్మసీ విద్యార్థులకు ఫార్మా రంగంలో మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఒక కీలకమైన అడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అత్యుత్తమ ఫార్మసీ కళాశాలలు, విద్యా నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అందుబాటులో ఉన్నప్పటికీ... పలు ఫార్మా కంపెనీలు ఫార్మసీ నేపథ్యం లేని సాధారణ డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయని కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఫార్మా పరిశ్రమలో నాణ్యమైన సేవలు అందడంలో లోపాలు తలెత్తుతున్నాయని కౌన్సిల్ వైస్ ఛైర్మన్ దారపు ఎన్.ఆర్.పి. రెడ్డి అభిప్రాయపడ్డారు.


ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు , అర్హత కలిగిన బి-ఫార్మసీ విద్యార్థులకే ఫార్మా సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించేలా చూసేందుకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ దిశగా వైస్ ఛైర్మన్ దారపు ఎన్.ఆర్.పి. రెడ్డి, ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఫార్మసీ విద్యావేత్తలు, యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సమావేశంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు డాక్టర్ ఎం. నిరంజన్ బాబు, డాక్టర్ ఎం. వేంకటరమణలతో పాటు, APTI ఏపీ అధ్యక్షుడు డాక్టర్ కె. వెంకటరమణ, ఫార్మసీ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ ఎన్.వి.వి. జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ జి. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు , ఉపాధి కల్పనపై వీరంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యార్థులకు మరింత విస్తృత అవకాశాలు కల్పించేందుకు ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడనున్నట్లు కౌన్సిల్ వైస్ చైర్మన్ తెలిపారు . ఈ విషయమై త్వరలోనే హైదరాబాద్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు దారపు ఎన్.ఆర్.పి. రెడ్డి వెల్లడించారు. బి-ఫార్మసీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కౌన్సిల్ ఈ చొరవను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రూ. లక్ష కోట్లు ముంచిన కేసీఆర్‌ను కాపాడుతున్న సీఎం రేవంత్: నిజామాబాద్ ఎంపీ

ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 08:10 PM