రూ.40 లక్షలు ఇస్తామన్నా నో చెప్పిన కర్లపూడి
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:35 AM
నెల్లూరు జిల్లా కోట మండలం కర్లపూడి పంచాయతీ సర్పంచి పదవిని ఎస్టీ పురుషుడికి కేటాయించారు. దీంతో పెత్తనం చెలాయించేందుకు షాడోలు తెరపైకి వచ్చి పంచాయతీలో వేలం నిర్వహించారు.
కోట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కోట మండలం కర్లపూడి పంచాయతీ సర్పంచి పదవిని ఎస్టీ పురుషుడికి కేటాయించారు. దీంతో పెత్తనం చెలాయించేందుకు షాడోలు తెరపైకి వచ్చి పంచాయతీలో వేలం నిర్వహించారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఇవ్వాలంటే వేలం జరగాలని గ్రామంలోని టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆదివారం వేలం నిర్వహించారు. రూ.16 లక్షల నుంచి మొదలై రూ.40 లక్షల వరకు పాట వెళ్లింది.
గ్రామస్థులు మాత్రం రూ.60 లక్షలిస్తేనే ఏకగ్రీవానికి ఒప్పుకొంటామని తేల్చిచెప్పారు. దీంతో ఆ పంచాయతీలోని పెద్దలు, వైసీపీలోని ఓ వర్గంవారు పాట నచ్చకపోవడంతో అర్ధంతరంగా పలాయనం చిత్తగించారు. చివరకు ఆ పంచాయతీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని గ్రామ పెద్దలు తీర్మానించుకున్నట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!