Share News

నామినేషన్ల తొలిరోజే రాయచోటిలో బాహాబాహీ

ABN , Publish Date - Nov 16 , 2026 | 01:00 AM

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే హింసాత్మక ఘటనలు జరిగాయి.

నామినేషన్ల తొలిరోజే రాయచోటిలో బాహాబాహీ

అన్నమయ్య, నవంబరు 15 (ఆంధ్ర జ్యోతి): అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే హింసాత్మక ఘటనలు జరిగాయి. టీడీపీ, వైసీపీ మద్దతుదారులు బాహాబాహీకి దిగారు. రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు టీడీపీ మద్దతుదారులకు తీవ్ర గాయాలయ్యాయి. రామాపురం మండలం హసనాపురం పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసిన టీడీపీ మద్దతుదారు హరినాథరెడ్డి ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు.

ఈ దాడిలో ఆయన తండ్రి రాజారెడ్డి తలకు బలమైన గాయమైంది. రాయచోటి మండలం సిబ్యాల నామినేషన్‌ కేంద్రంలో పెమ్మాడపల్లెకు చెందిన టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పెమ్మాడపల్లెకు చెందిన టీడీపీ వర్గీయుడు రాయల్‌ ప్రభు తల పగిలింది. ఇదే గ్రామానికి చెందిన ఇడగొట్టు భాస్కర్‌ కూడా గాయపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 01:02 AM